మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 జనవరి 2021 (21:40 IST)

chapatis: చపాతీలు తింటే జరిగే మేలు ఎంత? రోజుకి ఎన్ని చపాతీలు తినాలి?

ఈమధ్య కాలంలో స్థూలకాయం, ఊబకాయం సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. దీన్ని అధిగమించేందుకు అన్నం మానేసి చపాతీలు, పండ్లు, పచ్చి కూరగాయలు ఆరగిస్తున్నారు. చాలామంది ఈ శీతాకాలంలో తినేది చపాతీలే. ఈ చపాతీలు తినడం వల్ల కలిగే మేలు ఏమిటో చూద్దాం.
 
రోజువారీ భోజనానికి చపాతీలను జోడించడం ద్వారా సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన మార్గం అవుతుంది. చపాతీల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చపాతీలు గొప్ప ఆహారం. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది.
 
ఎన్ని చపాతీలు తినాలి?
ఒక రోజుకి సరిపడా క్యాలరీలు అందాలంటే.. సుమారుగా 15 నుంచి 16 చపాతీలు తినాల్సి వుంటుంది. ఐతే కేవలం చపాతీలు మాత్రమే తినలేం కదా. రోజూలో స్వీట్లు, ఇతర పదార్థాలను కూడా తీసుకుంటూ వుంటాం కనుక అదేపనిగా చపాతీలు తినలేం. అందువల్ల రోజుకి 4 నుంచి 5 చపాతీలు సరిపోతాయి. అంతకుమించితే చపాతీలే కాదు ఏవైనా అతిగా తింటే అనర్థదాయకమే.