శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (18:57 IST)

చింత చిగురుతో చెడు కొలెస్ట్రాల్ పరార్.. ఎలాగంటే?

Tamarind Leaves
చింత చిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టవచ్చు. చింత చిగురును ఆహారంలో భాగం చేసుకుంటే.. థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్ వున్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. చింత చిగురు పేస్ట్‌ను కీళ్లపై వుంచితే నొప్పులు, వాపులు తొలగిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. 
 
కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు ఇందులో వున్నాయి.
 
కడుపు నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. చింత చిగురును ఉడికించిన నీటితో నోటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫార్మేటరీ గుణాలు చింత చిగురులో వున్నాయి. తరచూ చింత చిగురును తీసుకుంటే ఎముకల ధృఢత్వానికి మేలు జరుగుతుంది. ఇందులోని ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.