గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (23:38 IST)

దానిమ్మ రసం తాగితే ఏమవుతుంది?

దానిమ్మ తినటానికి రుచికరంగా ఉంటుంది. దానిమ్మ పండు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. రక్త శుద్ధికి దానిమ్మను మించిందిలేదు. మరిన్ని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
దానిమ్మలో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని కొలెస్ట్రాల్ నిరోధిస్తుంది. అందుకే హృద్రోగులకు చాలా మంచిది.
 
దానిమ్మలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలతో పాటు గాయాలను నయం చేసి సత్వర శక్తిని ప్రసాదించే పోషకాలు వున్నాయి.
 
రెడ్ వైన్‌, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లకు మూడు రెట్లు అధికంగా దానిమ్మలో ఉంటాయి.
 
క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని అడ్డుకునే గుణాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి.
 
దానిమ్మ రసంతో హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
 
దానిమ్మ వృద్ధాప్య చాయలు తగ్గిస్తుంది. దానిమ్మతో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
 
రుతుస్రావం సమయంలో ఉండే ఇబ్బందులను దానిమ్మ తగ్గిస్తుంది.
 
రక్త నాళాలు మూసుకుపోయే పరిస్ధితుల నుండి దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల బయటపడవచ్చు.