ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 19 డిశెంబరు 2022 (21:07 IST)

పెసర పప్పుతో ప్రయోజనాలు ఇవే

Moong Dal
ముఖం, శరీరం, జుట్టు అందాన్ని పెంచడానికి మూంగ్ దాల్ లేదా పెసర పప్పు చాలా మేలు చేస్తుంది. మీ అందాన్ని పెంచే మూంగ్ దాల్ సౌందర్య ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
పొడి చర్మం ఉన్నవారికి మూంగ్ దాల్ మాస్క్‌లా పనిచేస్తుంది.
 
మీరు చేయాల్సిందల్లా, రాత్రంతా పప్పును పచ్చి పాలలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి.
 
ఇప్పుడు ఈ పేస్ట్‌ను శుభ్రమైన ముఖంపై అప్లై చేసి, తర్వాత 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
 
ఇది ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా, శుభ్రంగా మార్చడంలో సహాయపడుతుంది.
 
ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడే వారికి మూంగ్ దాల్ అద్భుతమైనది.
 
కొంచెం పెసర పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
 
ఇప్పుడు దానికి అర టీస్పూన్ నెయ్యి వేసి ముఖానికి పట్టించాలి. మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి.
 
మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని వారానికి 3 సార్లు ఉపయోగించండి.
 
మూంగ్ దాల్ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. దీని కోసం కొంచెం మూంగ్ పప్పును ఉడకబెట్టి రుబ్బుకోవాలి.
 
దానికి గుడ్డు పచ్చసొన, నిమ్మకాయ, పెరుగు జోడించండి. జుట్టుకి పట్టించి 15 నిమిషాలు అలా వదిలివేయండి. తేలికపాటి షాంపూతో దీన్ని కడగాలి.
 
గమనిక: చిట్కాల ఆచరించే ముందు బ్యూటీషియన్ సలహా తప్పనిసరి.