బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 22 మార్చి 2022 (22:51 IST)

వేసవిలో ఈ పండ్ల రసం తాగితే...

కాలానికి తగ్గట్లు వచ్చే పండ్లను తింటూ వుండాలి. దానివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి వాటిలో దానిమ్మ పండ్లు వుంటాయి. దానిమ్మ జ్యూస్ చర్మాన్ని సంరక్షించడంలో, క్యాన్సర్ గుణాలను ఎదుర్కోవడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

 
ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ వ్యాధిని నివారించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. డయాబెటిస్ వ్యాధులకు ఇతర పండ్లను కాకుండా, దానిమ్మ రసాన్ని తగు మోతాదులో తీసుకుంటుంటారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 

 
అలాగే క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపుతుంది. దాంతోపాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. ఈ జ్యూస్ తరచు తీసుకోవడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలానే అధిక బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కీళ్ల వ్యాధులు ఉన్నవారు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మంచిది.