బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (22:26 IST)

ప్రతిరోజూ కప్పు వెన్నలేని పెరుగును తీసుకుంటే?

చాలామంది మాంసకృత్తుల్ని రాత్రి తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకుంటారు కానీ.. రోజంతా ఆ పోషకం తరచూ అందుతూనే ఉండాలి. పొద్దున్నే తీసుకునే టిఫిన్ నుంచీ, రెండు పూటలా చేసే భోజనం, స్నాక్స్ ఇలా తీసుకునే ప్రతీ ఆహారంలో మాంసకృత్తులు ఎంతో కొంత అందుతూనే ఉండాలి. దానివల్ల కాలేయంలో పేరుకొన్న వృధా పదార్థాలు, శరీరానికి హానిచేసే రసాయనాలు పోతాయి.

 
గ్రీన్ టీలో ఉండే ప్రత్యేక పదార్థాలు శరీరంలో పేరుకొన్న ఫ్రీరాడికల్స్‌ని తొలగిస్తాయి. అదే సమయంలో యాంటీ ఆక్సిడెంట్లూ లాంటి పోషకాలు దీన్నుంచి అందుతాయి. సాధారణంగా అయితే రోజుకు మూడు కప్పులు తాగడం మంచిది. అయితే సరైన గ్రీన్‌టీని ఎంచుకోవాలి.

 
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్లనే కాదు, బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది. బ్రిటన్‌కి చెందిన అధ్యయనకర్తలు వెల్లుల్లి ఎక్కువగా తినేవారిలో జలుబు వచ్చే అవకాశం చాలా తక్కువని తేల్చారు. కాబట్టి వెల్లుల్లిని తరచుగా కుదిరితే రోజూ ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

 
అధ్యయనాల ప్రకారం.. ప్రతిరోజూ కప్పు వెన్నలేని పెరుగును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని దాంతో జలుబు, సాధారణ జ్వరాలు వచ్చే అవకాశం ఇరవైఅయిదు శాతం తగ్గుతుందని తెల్చారు నిపుణులు. ఇందులో ఉండే మేలుచేసే బ్యాక్టీరియానే అందుకు కారణం.

 
తేనె. ఇందులో ఉంటే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు వైరస్, బ్యాక్టీరియాల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌తో పోరాడతాయి. అంటే రోగనిరోధకశక్తిని దృఢంగా ఉంచుతాయి.