బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (19:48 IST)

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు - భారత్‌కు పొంచివున్న ముప్పు

పొరుగు దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరేలా కనిపిస్తుంది. రోజువారీగా నమోదయ్యే స్టెల్త్ ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా చైనాలోని పలు నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. 
 
మరోవైపు, చైనాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో భారత్‌కు కూడా ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దఫా కరోనా వైరస్ ఏకంగా 75 శాతం మందికి సోకవచ్చని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కరోన్ థర్డ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం బీఏ.2 వేరియంట్ అని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉంకా కనిపిస్తున్నాయని, అందువల్ల నాలుగో దశ కరోనా వైరస్ వ్యాప్తి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే జూలై నెలలో నాలుగో వేవ్ ప్రారంభంకావొచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.