బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 జులై 2022 (23:30 IST)

సబ్జా విత్తనాలు అతిగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

సబ్జా విత్తనాలను తినవచ్చు కానీ వీటిని ఇతర మందులతో ఇది తేడా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విత్తనాలు ఎటువంటి ముప్పును కలిగి ఉండవు. దాదాపు అందరు వ్యక్తులు వీటిని తీసుకోవచ్చు. ఐతే సబ్జా గింజలను ప్రతిరోజూ తినాలనుకునేవారు మాత్రం డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించాల్సిందే. పరిమిత పరిమాణంలో ఈ విత్తనాలను తీసుకుంటే, అవి ఎటువంటి ముప్పును కలిగి ఉండవు. కానీ ఈ విత్తనాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. రోజువారీ సిఫార్సు మోతాదు ఒక టేబుల్ స్పూన్ మించకూడదు. అయితే ఇది వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు.

 
ఈ విత్తనాల వల్ల కలిగే దుష్ప్రభావాలలో అతిసారం, వాంతులు, వికారం, మొటిమలు, యాసిడ్ రిఫ్లక్స్, తలనొప్పి, కడుపులో అసౌకర్యం, ఆకలి లేకపోవడం మొదలైనవి ఉన్నాయి. అవి కొందరిలో రక్తంలో చక్కెర తగ్గడానికి కూడా కారణమవుతాయి. చాలా మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు సబ్జా విత్తనాలను గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు కూడా సిఫారసు చేయరు. ఎందుకంటే పిల్లలు విత్తనాలను నీటిలో బాగా కలపకపోతే అవి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. స్త్రీల విషయానికి వస్తే... శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తాయని నమ్ముతారు. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఇది సిఫార్సు చేయబడదు.

 
సబ్జా విత్తనాల ఆయిల్, ఎక్స్‌ట్రాక్ట్‌లు రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తాయి. కనుక ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే లేదా గాయపడినట్లయితే, ఇది వినియోగానికి సిఫార్సు చేయబడదు. షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సను చేయాల్సి వుంటే కనీసం రెండు వారాలకి ముందే సబ్జా విత్తనాలను వాడటం మానేయాలి.