శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 29 నవంబరు 2018 (21:59 IST)

ఎదిగే పిల్లలకు ఎలాంటి పదార్థాలు పెట్టాలో తెలుసా?

సాధారణంగా ఈ కాలంలో పిల్లలు సరియైనా పోషకాహారం తీసుకోవటం లేదు. దీనికారణంగా వీరు సన్నగా, బలహీనంగా తయారవుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు నూడుల్స్, పిజా, బర్గర్ అంటూ జంక్‌పుడ్‌కి అలవాటుపడి బలమైన ఆహార పదార్థాలను తినటం మానేస్తున్నారు. మరికొందరు డైటింగ్ పేరుతో ఏదీ తినకుండా ఉంటున్నారు. 
 
ఇలా చేయడం వలన పిల్లలలో పోషకాహారలోపం ఏర్పడి పెరుగుదల ఆగిపోతుంది. పిల్లలు కూడా బలహీనంగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలు సరియైన క్యాల్షియం ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోకపోవటం వలన ఎముకలలో సాంద్రత తగ్గిపోతుంది.  ఎముకలు పెళుసులాగా మారి విరిగిపోవడం, కీళ్లవాపులు రావడం జరుగుతుంది. అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఈ సమస్యను కొంతవరకూ తగ్గించాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉన్న పాలూ, పాలపదార్ధాలు, గుడ్లు, చేపలు లాంటివి క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.  
 
అలాగే కొంతమంది డైటింగ్ చేయడం వలన కొవ్వుతో పాటు కండరాల దృఢత్వము తగ్గుతుంది. కానీ కండరాలు దృఢంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది సాధ్యం కావాలంటే మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గింజలు, గుడ్లు, నూనె లాంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. మాంసకృత్తులు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గుతూనే మాంసకృత్తులు కోల్పోకూడదు. కొవ్వు అనేది సమతులాహారంలో ఒక భాగము. శరీరానికి కొద్దిగా కొవ్వుకూడా అవసరము. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తగినంత కొవ్వు పదార్ధాలు ఉండేలా చూసుకోవడం వలన రోజంతా చురుగ్గా ఉంటారు.