బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 15 సెప్టెంబరు 2021 (23:22 IST)

ఆగకుండా బరువు ఎందుకు పెరుగుతారు?

మనిషి దేహం 21 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటుంది. దేహం పెరిగే వరకు బరువు పెరగవచ్చు, కాబట్టి బరువు కూడా పెరుగుతూ ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత పొడవు పెరగడం ఆగిపోయింది. కాబట్టి, దేహ బరువు కూడా ఆగి పోవాలి. కానీ మనిషి తిండి మీద ఉన్న కోరిక వలన తిని, తిని బరువు మాత్రం ఆగకుండా వయస్సుతో పాటు పెంచుకుంటూ ఉన్నాడు. ఇదే అన్ని రకాల మానసిక, శారీరక దుఃఖాలకు కారణం.

 
మనిషి బరువు ఎప్పుడు కూడా వయస్సును బట్టి పెరగరాదు. పొడవును బట్టే పెరగాలి. వయస్సుతో పాటు పెరగాలి అని  చెప్పండం అజ్ఞానం. 21 సంవత్సరాల తర్వాత శరీరం పొడవు పెరగదు. కాబట్టి ఆ వయస్సులో ఉన్న బరువే వంద సంవత్సరాలైనా ఉండాలి. దానికి మించి ఒక్క కిలో కూడా పెరగరాదు.


కారణం ఏంటంటే? 21 సంవత్సరాలలో ఒక వ్యక్తి బరువు 50 కిలోలు ఉంటే, అతని దేహం లోపలి అవయవాలు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, పొట్ట, ప్రేగులు, మోకాళ్ళు, వెన్నెముక మొదలగునవి కూడా ఆ 50 కిలోల దేహానికి ఎంత పనిచేసే సామర్ధ్యం ఉండాలో, అంత సామర్థ్యం కలిగిన పై అవయవాలను మాత్రమే భగవంతుడు మనకు ఇచ్చి ఉంటాడు.
 
మనం మనస్సును అదుపు చేయలేక తిని, తిని ఉండవలసిన 50 కిలోల బరువు కన్నా అధికంగా 30 కిలోల బరువును 80 కిలోల వరకు పెంచుకున్నామనుకోండి. 50 కిలోల దేహానికి హాయిగా, సుఖంగా పని చేయగల శక్తి కలిగిన పై అవయవాలు అధికంగా ఉన్న దేహానికి పని చేయలేక త్వరగా పాడైపోతాయి. అందువలననే ఈ రోజులలో కిడ్నీస్ ఫెయిల్యూర్సు, హార్ట్ ఫెయిల్యూర్స్, లంగ్స్ ఫెయిల్యూర్, వెన్నెముక సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, బిపిలు, షుగర్స్ మొదలగునవి రావడానికి  కారణం.

 
50 కిలోలకు అందవలసిన శక్తి 80 కిలోల దేహానికి అందడం వలన, మనస్సుకు అవసరమైన శక్తి చాలకుండా కోపం, కోరికలు, ఇతర ఆవేశాలు పెరిగి, అనేక మానసిక సమస్యలకు కూడా కారణం. కనుక వెంటనే బరువు పెరగడం ఆపాలి. పెరిగిన బరువును తగ్గించుకోవాలి.