ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 25 జులై 2016 (21:28 IST)

మధ్యాహ్న నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా...?

మధ్యాహ్నం సమయంలో చిన్న కునుకు తీస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆ కునుకు 30 నిమిషాలకు మించి ఉండకూడదని వారు అంటున్నారు. మధ్యాహ్న సమయంలో 40 నిమిషాలకు మించి నిద్రపోయే వారిలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం సమస్యలు తలెత్తే అవకాశాలు

మధ్యాహ్నం సమయంలో చిన్న కునుకు తీస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆ కునుకు 30 నిమిషాలకు మించి ఉండకూడదని వారు అంటున్నారు. మధ్యాహ్న సమయంలో 40 నిమిషాలకు మించి నిద్రపోయే వారిలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. 
 
మధ్యాహ్న సమయంలో మొద్దు నిద్ర పోయేవారిలో మెటబాలిజం సిండ్రోమ్‌కు దారితీసే అవకాశాలు 50 శాతం వరకూ ఉంటాయని వారు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వీరి జీవక్రియల్లో చాలా మార్పులు సంభవిస్తాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు ఉన్న వారు వెంటనే తమ అలవాటును మార్చుకోవాలని వారు సూచిస్తున్నారు.