గురువారం, 20 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 మే 2024 (21:35 IST)

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

Successful Limb Salvage Surgery
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) కుడి ముంజేయి యొక్క పునరావృత సైనోవియల్ సార్కోమా (SS)తో బాధపడుతున్న 42 ఏళ్ల మహిళా రోగికి లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రూపం, సైనోవియల్ సార్కోమా. ఇది సాధారణంగా తుంటి, మోకీలు, చీలమండ లేదా భుజంలో కనిపిస్తుంది. రోగి గతంలో వివిధ ఆసుపత్రులలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా చేతిని తొలగించాల్సిందిగా సిఫార్సు చేయడంతో పాటుగా తదుపరి శస్త్రచికిత్స అసాధ్యంగా పరిగణించాయి.
 
మంగళగిరిలోని ఏఓఐ వద్ద రోగి యొక్క ప్రయాణం రెండు కీమోథెరపీ చికిత్సలతో ప్రారంభమైంది, ఆ తర్వాత డాక్టర్ ఇషాంత్ అయినపూరి సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. కుడి ముంజేయిలోని కండరాలు, నరాలు, రక్తనాళాల్లోకి కణితి వ్యాపించింది. సిర, ధమనిలోని ట్యూమర్ త్రంబస్ విభజన నుండి 1cm వరకు విస్తరించి ఉంది, ఇది మంచి మార్జిన్‌తో విజయవంతంగా తొలగించబడింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, శస్త్రచికిత్స బృందం ముంజేయిలో ముఖ్యమైన నరాలను (మధ్యస్థ నాడి, రేడియల్ నరాలు) కాపాడుతూ అన్ని ప్రభావిత భాగాలను విజయవంతంగా తొలగించింది. వాస్కులర్ పునర్నిర్మాణం, నరాల పునర్నిర్మాణం జరిగింది.
 
ఏఓఐ లోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి ఈ కేసు గురించి వెల్లడిస్తూ, "ఈ కేసు యొక్క సంక్లిష్టత కారణముగా ఖచ్చితమైన ప్రణాళిక, అమలు చేసే విధానం అవసరం. మేము కణితిని పూర్తి స్థాయిలో వేరు చేయగలిగాము, ఇది మధ్యస్థ నాడి, రేడియల్ నరాల నుండి వేరు చేయబడింది. ధమని పునర్నిర్మాణం కోసం రోగి యొక్క ఎడమ కాలు సఫేనస్ నరంను ఉపయోగించడం, ఉల్నార్ నరాల పునర్నిర్మాణం కోసం రోగి యొక్క  ఎడమ కాలు సురల్ నరంను వినియోగించాము. రోగి యొక్క స్థిరత్వం, బృందం యొక్క నైపుణ్యం ఈ శస్త్రచికిత్స విజయంలో కీలక పాత్ర పోషించాయి.
 
ఏఓఐ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, "ఈ కేసు అధునాతన శస్త్రచికిత్సలను అందించడంలో ఏఓఐ యొక్క నిబద్ధతను వెల్లడిస్తుంది. సవాలుతో కూడిన రోగనిర్ధారణలు కలిగిన రోగులకు ఆశాజనకంగా ఉంది. మా మల్టీడిసిప్లినరీ విధానంతో పాటుగా అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడంలోని నైపుణ్యం, ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించడం సులభం చేస్తుంది. మేము అత్యున్నత స్థాయి సంరక్షణను అందించడానికి, ఆంకాలజీ చికిత్సలో హద్దులను అధిగమించటానికి అంకితభావంతో ఉన్నాము" అని అన్నారు. 
 
రోగి పూర్తిగా కోలుకున్నారు, ఆమె చేతి కదలిక సాధారణమైనది, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స వినూత్నమైన, రోగి-కేంద్రీకృత సంరక్షణను అందించడంలో ఏఓఐ యొక్క అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది, సంక్లిష్ట క్యాన్సర్ నిర్ధారణలను ఎదుర్కొంటున్న వారికి కొత్త ఆశను అందిస్తుంది. విజయవాడ-మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) ఆంధ్ర ప్రదేశ్‌లోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటి, ఈ ప్రాంతంలో విస్తృతమైన క్యాన్సర్ చికిత్స సేవలను అందిస్తోంది. ఏఓఐ  క్లినికల్ నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత మరియు కారుణ్య సంరక్షణను మిళితం చేసి ఈ ప్రాంతంలో అత్యున్నత స్థాయి క్యాన్సర్ చికిత్సను శ్రేష్ఠతకు కట్టుబడి అందిస్తుంది.