సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:47 IST)

హెర్నియా సర్జరీలో సరికొత్త పద్ధతులు: ఇంట్యూటివ్ ఇండియాతో చేతులు కలిపిన హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా

image
హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా (HSI), మినిమల్లీ ఇన్వాసివ్ కేర్‌లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మరియు రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ (RAS) యొక్క మార్గదర్శక సంస్థ అయిన ఇంట్యూటివ్ తో చేతులు కలిపి హెర్నియా సర్జన్ల కోసం జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించింది. HSICON 2023 పేరుతో మూడు రోజుల పాటు జరిగిన సదస్సు, రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స వంటి శస్త్రచికిత్సా పద్ధతుల పై దృష్టి సారించి కొత్త యుగానికి ప్రాధాన్యతనిస్తూ 'హెర్నియా సింప్లిఫైడ్: రిపేర్ టు రీకన్‌స్ట్రక్షన్' అనే థీమ్‌తో విభిన్న సర్జన్లు, నిపుణులు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఈ సదస్సులో భాగంగా ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలు సైతం జరిగాయి, ఇది ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది డా విన్సీ వంటి అధునాతన శస్త్రచికిత్స రోబోట్‌లతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలపై ప్రత్యక్ష పరిజ్ఞానంను అందించింది. మూడు రోజుల పాటు, నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనుభవజ్ఞులైన అభ్యాసకులు, వర్ధమాన సర్జన్ల దృష్టిని ఆకర్షించే విలువైన పద్ధతులు, విధానాలను పంచుకున్నారు. ఈ లైవ్ సెషన్‌లు ఆచరణాత్మక జ్ఞానం పంచుకునే అవకాశం కల్పించాయి. మినిమల్ యాక్సెస్ మరియు రోబోటిక్ చికిత్సలలో పురోగతిని ప్రదర్శించాయి. నిరూపిత-ఆధారిత ఔషధం యొక్క యుగంతో, హెర్నియా చికిత్స కోసం వివిధ నూతన-యుగపు సాంకేతిక పరిష్కారాలపై తగిన జ్ఞానాన్ని అందించడాన్ని ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ సదస్సులో భాగంగా, ది హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంట్యూటివ్‌తో కలిసి వారి Xi ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో సర్జన్‌ల కోసం రోబోటిక్-సహాయక శస్త్రచికిత్సపై విస్తృతమైన అభ్యాసాన్ని నిర్ధారించడానికి పాటు ఒక సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కేంద్రంలో ఇంట్యూటివ్‌ యొక్క తాజా డావిన్సీ Xi సాంకేతికత మరియు వెట్ ల్యాబ్ వంటి ఇతర అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కేంద్రం రియల్ టైమ్ విజువల్ అసిస్టెంట్, డ్యూయల్ గ్రిప్ టెక్నాలజీ మరియు కుట్టు & అనుకరణ వ్యాయామాల కోసం అధునాతన సాంకేతికతలను కూడా ప్రదర్శించింది. ఇంట్యూటివ్‌ యొక్క రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స సిమ్యులేటర్, SimNow ను సైతం  Xi ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఉపయోగించారు.
 
HSICON 2023 ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ కోన లక్ష్మి ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ, “హెర్నియా అనేది ఇప్పటికీ సర్వసాధారణమైన శస్త్ర చికిత్సా సమస్యలలో ఒకటి మరియు దానికి చికిత్స చేసే శాస్త్రం అభివృద్ధి చెందుతూనే ఉంది. HSICON 2023 వంటి కార్యక్రమాల ద్వారా, మేము ఈ ఆందోళనను సమిష్టిగా పరిష్కరించడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాము. భారతీయ కోణంలో ప్రత్యేకమైన ఆకృతులకు అనుగుణంగా అధునాతన శస్త్రచికిత్స పద్ధతులు మరియు సాంకేతికతల శ్రేణిని మేము అన్వేషించేటప్పుడు మా దృష్టి సాంప్రదాయ విధానాలకు మించి విస్తరించింది. సర్జికల్ కమ్యూనిటీలో సామూహిక అవగాహనను మెరుగుపరచడం ద్వారా, మా రోగుల విలక్షణమైన అవసరాలకు అనుగుణంగా మరింత ప్రభావవంతమైన పరిష్కారాల వైపు మేము కోర్సును నడిపిస్తున్నాము" అని అన్నారు.