గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 17 జనవరి 2019 (19:32 IST)

నాతో పగటిపూట శృంగారం చేయడానికి నైట్ డ్యూటీ వేయించుకుంటున్నాడు...

మాది వైజాగ్. గత ఏడాది వివాహమైంది. అప్పటి నుంచి మేము రాత్రి పూట శృంగారంలో పాల్గొన్నది చాలా తక్కువ రోజులే. నా భర్త పగటి పూట మాత్రమే కావాలని మారాం చేస్తున్నాడు. అలా ఎందుకని అడిగితే సమాధానం చెప్పడు. పగటి పూట చేస్తేనే తృప్తిగా ఉందని అంటున్నాడు. నాకు పగటి పూట సెక్స్ అసౌకర్యంగా ఉంటుంది. పైగా నాతో పగటి పూట శృంగారం చేయాలని వాళ్ల కంపెనీలో పట్టుబట్టి తన డ్యూటీని నైట్ డ్యూటీగా మార్చుకున్నారు. ఆయన వైఖరి ఇలా ఎందుకు వుంటోంది. ఇలా పగటిపూట శృంగారం చేసేవారు వుంటారా?
 
సహజంగా రాత్రివేళ ఏకాంత సమయం, చక్కని పడకగది వాతావరణం సెక్సీ మూడ్‌ని పెంచుతుంది. ఆ విషయంలో ఆడ, మగ అభిప్రాయం ఒక్కటే. ఒకవేళ రాత్రి కుదరకపోతే వారు కోరుకునే మరో అనుకూల సమయం వేకువజాము. అంతేకాని మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో శృంగారానికి సుముఖత అతి తక్కువ శాతం ఉంది. 
 
దీనికి కారణాలు... రాత్రివేళ శృంగారంలో పాల్గొన్న తర్వాత ఇరువురు హాయిగా సేదతీరే అవకాశం వుంటుంది. ఆ తర్వాత చక్కని నిద్రపోవచ్చు. ఈ సమయంలో ఇద్దరికీ ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. పగటిపూట ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి పగటిపూట అనేది ఎంతమాత్రం అనువైనది కాదు. పగటిపూట చేసేటపుడు ఆయనకేదో ప్రత్యేకించి నచ్చి వుంటుంది. ఆ కిటుకు ఏమిటో గ్రహించి అది రాత్రిపూట ప్రయోగిస్తే అతడు తిరిగి డే డ్యూటీకి వెళ్లి దీన్ని నైట్‌కి మార్చుకుంటాడు.