బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (16:16 IST)

ఆమె అలా సరదీస్తుంటే నాకు మూడ్ వచ్చి చస్తుంటాను...

నా మేనమామ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆమె చాలా అందగత్తె. అంతేకాదు... ఆమెకు భక్తి ఎక్కువ. పండుగలు, ప్రత్యేక దినాలు వస్తే.. ఇక ఆ రోజు నాకు చుక్కలు కనబడతాయి. పూర్తిగా దైవ కార్యంలో పాల్గొంటుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలకు వెళ్లిపోతోంది. ఆ సమయంలో నేను ఫోన్ చేయాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా స్విచాఫ్ చేసి పారేస్తుంది. వారంలో కనీసం నాలుగు రోజులు ఏదో ఒక దైవ కార్యం చేస్తూ పూర్తిగా అందులో నిమగ్నమైపోతుంది. అదేమని అడిగితే... ఈ పాడు మానవ జన్మ మళ్లీ ఎత్తకుండా పూజలు చేస్తున్నట్లు చెపుతుంది.

ఈ పరిస్థితుల్లో ఆమెతో వారానికి ఒక్కసారి శృంగారంలో పాల్గొనడమే గగనమవుతోంది. అసలు ఆ పేరెత్తితే కస్సుమంటుంది. కొడుతుంది. మొన్నామధ్య బలవంతంగా శృంగారం చేయబోతే పళ్లతో గట్టిగా కొరికింది. ఈ బాధలన్నీ బయటకు చెబితే పరువు పోతుందని భరిస్తున్నా. ఆమె చాలా అందగత్తెని, బాగా జీవితం అనుభవించవచ్చని పెళ్లి చేసుకుంటే నాకు చుక్కలు చూపిస్తోంది. పైగా సాయంత్రమైతే ఎంతో భక్తితో నా దగ్గరకు వచ్చి నా కాళ్లను ఒత్తుతూ, శరీరానికి మర్దన చేస్తుంది. 

అలాంటి సమయంలో నాకు మూడ్ వచ్చి చస్తుంటాను. పొరబాటును తేడాగా ప్రవర్తిస్తే ఇక మళ్లీ భజన చేస్తుంది. అందుకే అవన్నీ గట్టిగా అదిమేసుకుంటున్నా. పైగా ఆమెకు మరో అలవాటు వుంది. సాయంకాలం దీపం వెలిగించి దేవుడి వద్ద పూజ ముగిసిన తర్వాత నేరుగా నా పాదాలకు నమస్కరించి పూజ చేసి... నువ్వే నా దైవం అంటుంటుంది. అసలు ఈమె వైఖరి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా మైండ్ చలించి వుంటుందా?
 
సాధారణంగా చాలామంది మహిళల్లో శృంగారం అంటే భయం గూడుకట్టుకుని ఉంటుంది. మరికొంతమంది అసలు అదంటేనే అసహ్యించుకుంటారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలు శృంగారం పట్ల సముఖత చూపరు. వీటికి అనేక కారణలు లేకపోలేదు. ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, జీవనశైలి... ఇలాంటి ఎన్నో విషయాలతో స్త్రీ శృంగార చర్య ముడిపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీలలో శృంగార సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు. 
 
మీ విషయంలో ఆమెకు చిన్నప్పట్నుంచి ఆధ్యాత్మిక చింతన బాగా అలవడినట్లుంది. పైగా శృంగారం తప్పనే భావన ఆమెలో బలంగా నాటుకుపోయింది. కాబట్టి దాన్ని ముందుగా మనసు నుంచి తొలగించాలి. మీరు చూస్తుంటే ఇంటి నుంచి కదులుతున్నట్లు లేరు. ఆమె మనసు మళ్లే ఒకే ఒక మార్గం విహార యాత్ర. ఆమెను 15 రోజుల పాటు విహార యాత్రకు తీసుకుని వెళ్లండి.

అక్కడ ఆమె అనుకున్నట్లు చేసేందుకు అనుకూలించదు. దాంతో మీ దారికి వచ్చే మార్గం వుంటుంది. అలా మార్గంలోకి వచ్చాక... ఆధ్యాత్మికత తప్పు కాదు... అలానే శృంగారం తప్పు కాదని చెప్పే వ్యాసాలను కానీ, చిత్రాలను కానీ చూపించండి. క్రమంగా మీ మాట వింటుంది. ప్రయత్నించండి.