బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (10:57 IST)

వాడేసిన టీ బ్యాగ్‌లను పారేస్తున్నారా? (Video)

టీ బ్యాగ్‌లు టీ తాగేనంత వరకు వాటిని ఉపయోగిస్తాం... వాడగానే వాటిని విసిరి పారేస్తుంటాం. కానీ వాడేసిన టీ బ్యాగ్‌లతో కొన్ని ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
 
* దోమ కాటు: టీ బ్యాగ్‌ను నీళ్లతో తడిపి, వాపు ఉన్న ప్రదేశంలో పది నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే వాపు అదుపులోకి వస్తుంది.
 
* కళ్ల కింద వాపు: కళ్ల అడుగున ఉబ్బు లాంటి వాపు తగ్గించాలన్నా కూడా నీళ్లతో తడిపిన టీ బ్యాగ్‌ను మూసిన కనురెప్పల మీద పది నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే మీకు మంచి ఫలితం వుంటుంది. 
 
* కమిలిన చర్మం: ఎండకు చర్మం కమిలితే, వాడిన టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, వాటిని చర్మం మీద ఉంచి పది నిమిషాల పాటు పట్టు వేయాలి. ఇలా చేస్తే మెరుగైన సౌందర్యం సొంతం చేసుకోవచ్చు. 
 
* గాయాలు, గాట్లు: పొరపాటున చేయి తెగినప్పుడు అందుబాటులో బ్యాండ్ ఎయిడ్ లేకపోతే, వాడిన టీ బ్యాగ్‌ను గాటు మీద ఒత్తి ఉంచాలి. ఇలా చేయడం వల్ల టీ పొడిలో ఉండే టానిన్స్ అనే మూలకాలు, రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి.