శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (17:08 IST)

రోజూ గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే..?

చాలామంది పనిచేసి చేసి అలసిపోతుంటారు. దీని కారణంగా కాసేపు పడుకోవడమో, తలకిందకు వాల్చి ఉండడమో చేస్తుంటారు. ఇలా చేయకూడదని  నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ముఖంలోని సైనస్‌లో మరింతగా నీరు చేరుతుంది. ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. కాబట్టి బయటకెళ్లే ముందు 5 నిమిషాలపాటు నిటారుగా కూర్చోవాలని సూచిస్తున్నారు.
 
అలసటను తొలగించాలంటే.. రోజుకో గ్లాస్ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ రసాన్ని తీసుకోవడం వలన జలుబు వస్తుందని చాలామంది అనుకుంటారు. అందుకు ఏం చేయాలంటే.. నిమ్మరసాన్ని ఉదయాన్నే లేదా మద్యాహ్నం వేళల్లో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవు. మంచి ఉపశమనం లభిస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోను రాత్రి సమయంలో మాత్రం నిమ్మరసాన్ని తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. 
 
అలాగే, జలుబు చేసినపుడు కళ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. దీనికి కారణం జలుబు కారణంగా కళ్ల చుట్టూ ఉండే నరాలు కాస్త వెడల్పుగా మారడమే. ఈ సమస్య నివారణకు టీ బ్యాగులు చక్కగా పనిచేస్తాయి. ఈ బ్యాగులను 15 నిమిషాలపాటు కళ్లపై ఉంచుకోవాలి. టీలోని కెఫైన్‌కి తడి కళ్లచుట్టూ ఒత్తిడి పెంచుతాయి. ఆ ఒత్తిడి నరాలను మామూలు స్థితికి తెస్తుంది. దాంతో కళ్ల వాపు తగ్గుతుంది.