శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2017 (16:48 IST)

వామ్మో... క్యారెట్ ఎక్కువగా తింటున్నారా...?

చాలామంది క్యారెట్‌ను ఎక్కువగా తింటుంటారు. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. బాగా రక్తంపడుతుంది అంటుంటారు. కానీ క్యారెట్ తక్కువగా తింటే మంచిదే. అంతకుమించి తింటే మాత్రం చాలా ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు. ఇదే విషయం పలు పరిశోధనల్లో రుజువైంది. క్యారెట

చాలామంది క్యారెట్‌ను ఎక్కువగా తింటుంటారు. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. బాగా రక్తంపడుతుంది అంటుంటారు. కానీ క్యారెట్ తక్కువగా తింటే మంచిదే. అంతకుమించి తింటే మాత్రం చాలా ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు. ఇదే విషయం పలు పరిశోధనల్లో రుజువైంది. క్యారెట్‌ను మామూలుకన్నా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ జీర్ణం కాక ఎసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సహాయం లేకుండా క్యారెట్ అస్సలు తీసుకోకూడదట. క్యారెట్‌లో షుగర్ శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి బ్లడ్ షుగర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అదేవిధగా పాలు ఇచ్చే తల్లులు ఎక్కువగా క్యారెట్ అస్సలు తీసుకోకూడదట. అది కూడా చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.