శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 29 మార్చి 2017 (22:32 IST)

మట్టిపాత్రలో మజ్జిగ... వేసవిలో తాగితే ఏం జరుగుతుంది?

వేసవి వచ్చేసింది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పానీయాలు తప్పనిసరి. ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రేవులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో అధిక

వేసవి వచ్చేసింది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పానీయాలు తప్పనిసరి. ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రేవులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో అధికంగా ఉంటాయి. విరేచనాలు, వాంతులు అధిక దాహం వంటి సమస్యలు లేదా నీరసం కాళ్లు తిమ్మిర్లు తలెత్తినపుడు మజ్జిగలో ఉప్పుకానీ, పంచదార కానీ వేసుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
అయితే, ఈ మజ్జిగను మట్టి పాత్రలో చేసుకుని తాగితే ఇంకా చాలా మంచిగా ఉండటమే కాకుండా మంచి గుణవర్థక పదార్థంగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. పెరుగుకు రెండు లేదా మూడింతలు నీళ్లు కలిపిన మజ్జిగ తాగితే మంచిదని, ఇది శరీరానికి ఎలాంటి హాని చేయదని చెపుతున్నారు.