మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (10:36 IST)

జీలకర్ర గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తీసుకుంటే...

సాధారణంగా మనం తరచూ వంటకాలలో రుచి కోసం  జీలకర్రను వాడుతూ ఉంటాం. దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే ఈ జీలకర్ర వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
 
1. ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు స్పూన్ల జీలకర్రను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని ప్రతి రోజు ఉదయం పూట త్రాగడం వలన శరీరానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది.
 
2. జీలకర్ర జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపులో ఏర్పడే అల్సర్‌ను తగ్గిస్తుంది.
 
3. జీలకర్రను ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడటం వలన అది చర్మంపై ఏర్పడిన ముడతలను తగ్గించి చర్మానికి మంచి నిగారింపునిస్తుంది.
 
4. జీలకర్ర అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జీలకర్ర రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్దీకరిస్తుంది. శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరచి గుండెకు రక్తం సాఫీగా జరిగేటట్లు చేస్తుంది.
 
5. ప్రతిరోజు జీరా వాటర్‌ను తాగడం వలన మూత్రాశయ సమస్యను తగ్గించి కిడ్నీలలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రేగులలో ఏర్పడే వ్యర్ధాలను తొలగిస్తుంది.
 
6. తరచూ జీలకర్రను వాడటం వలన కడుపులో ఏర్పడే వికారం, వాంతులు, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అతిగా వచ్చే త్రేన్పులను తగ్గిస్తుంది. ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెులలు వ్యాధిని నివారిస్తుంది.