ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 12 మే 2018 (16:01 IST)

గర్భిణీ మహిళలు కరివేపాకు పొడిని అన్నంలో వేసుకుని తింటే?

కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, ఫైబర్, కెలోరీలు లభిస్తాయి. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.

కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, ఫైబర్, కెలోరీలు లభిస్తాయి. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. 

భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం ఎక్కువే. అయితే ప్రస్తుతం కరివేపాకు వాడకం తగ్గుతోందని సర్వేలో తేలింది.  అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతుంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువుగా తయారవుతాయి. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది.
 
మహిళలు గర్భంగా ఉన్నపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వేవిళ్లను నిరోధించుకోవచ్చు. కరివేపాకు ఆకులకు జీర్ణ సమస్యలను తగ్గించే గుణాలున్నాయి.  కరివేపాకు ఆకులో జీలకర్రను కలిపి, బాగా దంచాలి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని రోజు తాగే పాలలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు.