మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (15:40 IST)

జామకాయలు తింటే పొట్ట తగ్గుతుందా? (video)

జామ అనేక రోగాలకు సాంప్రదాయక ఔషధం. జామ ఆకు రసంలోని సమ్మేళనాలు రుతుక్రమ సమస్యలను, విరేచనాలు, ఫ్లూ, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్‌తో సహా అనేక రకాల అనారోగ్యాలకు తగ్గించేందుకు పనిచేస్తుంది.
 
జామకాయలు రోజూ తీసుకోవచ్చా?
జామకాయల్లో ఫైబర్ పుష్కలంగా వుంది. అందువల్ల, ఎక్కువ జామకాయలు తినడం ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. వీటితో మలబద్దకాన్ని నివారించవచ్చు. మీరు సిఫార్సు చేసిన రోజువారీ ఫైబర్లో కేవలం ఒక జామ కాయ ద్వారా 12% అందుతుంది. అదనంగా, జామ ఆకు రసం తీసుకునేవారికి జీర్ణ ప్రక్రియకు మేలు చేస్తుంది.
 
జామతో పొట్ట తగ్గుతుందా?
జామ ఆకుల టీ తాగివారిలో పొట్టలో కొవ్వు కరుగుతుంది. మధుమేహాన్ని నియంత్రించడం, గాయాలను నయం చేయడం, జుట్టు ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.