1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (14:41 IST)

పొట్లకాయ రసం అక్కడ రాస్తే అది మటాష్... అంతే...

సాధారణంగా మనం ప్రతి రోజు రకరకాల కూరగాయలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. అలాంటి వాటిలో పొట్లకాయ ఆరోగ్యపరమైన సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. వాంతులు, విరోచనాలతో కూడిన జ్వర నివారణకు పొట్లకాయ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది అని అనేక ఆధునిక పరిశోధనలలో తేలింది. పొట్లకాయలో ఉన్న పోషకవిలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. పొట్లకాయలో విటమిన్ ఎ, బి, సిలతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, దంత సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. 
 
2. మధుమేహానికి పొట్లకాయ మంచి ఔషధంలా పని చేస్తుంది. పైగా కేలరీలు కూడా తక్కువ కావడంతో బరువు తగ్గుతారు.  
 
3. పొట్లకాయలోని పీచు మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరగటానికి తోడ్పడుతుంది.
 
4. పొట్లకాయ శరీరంలోని టాక్సిన్లను సమర్ధవంతంగా తొలగిస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
5. గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాస వ్యవస్థ పనితీరుకు దోహదపడుతుంది. 
 
6. పొట్లకాయ నుంచి తీసిన రసం రోజూ రెండు కప్పులు తాగితే హృద్రోగ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా బీపిని తగ్గిస్తుంది.
 
7. పొట్లకాయ రసాన్ని తలకు పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది.