మందార పువ్వు టీ తాగితే..?
మందార పువ్వులు అందానికి ఎంతో దోహదపడుతాయి. తరచు మందార పువ్వుతో ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. అంతేకాదు.. ఈ మందార పువ్వు పొడిని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలాంటి మందార పువ్వుతో టీ తయారుచేసి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..
1. లివర్ సమస్యలతో బాధపడేవారు.. తరచు మందార పువ్వులతో చేసిన టీని తాగితే మంచిది. ఈ టీ లివర్‌లోనె చెడు వ్యర్థాలను తొలగిస్తుంది. దాంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
2. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కారణంగా బరువు విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో పలురకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటివారు.. ప్రతిరోజు మందార పువ్వుతో తయారుచేసిన టీ తీసుకుంటే.. ఫలితం ఉంటుంది.
3. మందార పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా అందిస్తాయి.
4. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. ప్రతిరోజూ ఉదయాన్నే మందార పువ్వు టీ తీసుకుంటే.. ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దాంతో శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
5. రోజుకు ఒక్కసారైనా మందార పువ్వు టీ తీసుకుంటే అధిక బరువు తగ్గించవచ్చని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. కనుక తప్పక ఈ టీ తీసుకోవాలని చెప్తున్నారు వైద్యులు.