మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (11:06 IST)

జొన్నలతో అధిక బరువు చెక్...

ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒకటి సమయానికి తీసుకుని నిద్రలేమితో చాలామంది బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో రాగులు, జొన్నలు, సబ్జాలు, కొర్రలు వంటి పదార్థాలను తరచుగా తీసుకోవడం వలన మధుమేహం, అధిక బరువు, రక్తపోటు,

ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒకటి సమయానికి తీసుకుని నిద్రలేమితో చాలామంది బాధపడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రాగులు, జొన్నలు, సబ్జాలు, కొర్రలు వంటి పదార్థాలను తరచుగా తీసుకోవడం వలన మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, ఊబకాయం, గుండె వ్యాధులు వంటి సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
జొన్నల్లో క్యాల్షియం, ప్రోటీన్స్, పీచు పదార్థం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుటకు సహాయపడుతాయి. సబ్జా గింజల నీరు శరీరానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. దాహం తీర్చడంతో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూస్తుంది. అధిక బరువును తగ్గించేందుకు ఈ నీరు చక్కగా పనిచేస్తాయి. 
 
ఈ సబ్జా నీరు శరీరంలో కొవ్వును కరిగించుటకు చక్కగా పనిచేస్తుంది. రాగుల్లో ఇనుము, పాస్పరస్, క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుటకు రాగులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఆకలి నియంత్రణకు మంచిగా ఉపయోగపడుతాయి.