మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (13:48 IST)

ఉల్లికాడలతో చెడు కొలెస్ట్రాల్ చెక్....

ఉల్లికాడలలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. ఇవి శరీర సంపూర్ణ ఆరోగ్యానికి రక్షణగా ఉంటాయి. ఉల్లికాడలను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాం. ఈ ఉల్లికాడలలో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన క

ఉల్లికాడలలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. ఇవి శరీర సంపూర్ణ ఆరోగ్యానికి రక్షణగా ఉంటాయి. ఉల్లికాడలను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాం. ఈ ఉల్లికాడలలో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన క్యాన్సర్ వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియలు  సాఫిగా జరుగుతాయి.
 
ఈ కాడలలో కెరొటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతాయి. జలుబు వలన తలెత్తే సమస్యలను కూడా తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి. ఈ ఉల్లికాడల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని సెల్యులర్ టిష్యూలను దెబ్బతినకుండా కాపాడుతాయి. ఉల్లికాడలలో విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
 
తద్వారా రక్తపోటు సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా ఈ కాడల్లోని విటమిన్ కె ఎముకలను శక్తివంతంగా చేసేందుకు సహకరిస్తాయి. ఎముకల బలానికి ఉపయోగపడుతాయి. ఉల్లికాడల్లో యాంటీ ఫంగల్ సుగుణాల వలన శ్వాసకోశ సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తంలోని బ్లడ్‌షూగర్ ప్రమాణాలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
గాస్ట్రో ఇంటస్టైనల్ సమస్యల నుండి కాపాడతాయి. డయేరియా వంటి వాటిని నిరోధించుటలో చాలా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఆకలిని పెంచుటలో దోహదపడుతాయి. శరీరంలోని రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఈ ఉల్లికాడలు చక్కగా పనిచేస్తాయి. ఆస్తమా వంటి వ్యాధులను నిరోధిస్తాయి.