శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:47 IST)

రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధమేమిటి?

తేనె, నిమ్మరసం, అల్లంలో వ్యాధులను అరికట్టే సుగుణాలున్నాయి. కాబట్టి ఈ మూడింటిని కలిపి టానిక్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే నెలల తరబడి పాడవకుండా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. 
 
* రెండు పెద్ద నిమ్మకాయలను మధ్యకు తరగాలి.
* అల్లాన్ని చూపుడు వేలంత పొడవుగా ఉండే బద్దలుగా తరుక్కోవాలి. 
* ఈ ముక్కలు మునిగేంత వరకూ వాటిపై తేనెను పోయాలి. 
 
* తేనెతో సీసా నిండాక మూత బిగించి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. 
* అవసరమైనప్పుడు నేరుగా స్పూన్‌తో తినొచ్చు. లేదా వేడి నీళ్లలో స్పూన్ మిశ్రమాన్ని కలుపుకుని తాగొచ్చు.