గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:16 IST)

చేపలు తింటే.. నరాలకు బలం.. అందుకోసం వారానికి రెండుసార్లు..?

చేపల్లోని ఒమేగా-3 యాసిడ్స్ మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలను, ఆస్తమా, క్యాన్సర్లను చేపలు దరిచేరనివ్వవు. డయాబెటిస్‌ను నియంత్రించే చేపలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 
 
కంటి దృష్టి లోపాలను పోగొడుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే సంతానోత్పత్తికి చేపలు ఉపకరిస్తాయి. చేపలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సంతానలేమిని దూరం చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మగవారి సంతాన సంబంధ సమస్యలను అడ్డుకుంటాయి. 
 
చేపల్లో వుండే ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ శరీర రక్తంలోని ట్రై-గిసరైడ్‌లను తగ్గించటమే కాకుండా, రక్త పీడనాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కావున వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నరాల బలహీనతతో బాధపడేవారు వారానికి ఓసారైనా చేపలు తినాలి.
 
నరాల చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసే రక్షణ కవచాలు దెబ్బతిని.. దేహంతో మెదడు అనుసంధానత క్షీణించడంతో నరాల బలహీనత ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫాటీ ఆమ్లాలుండే చేపలు తినడం ద్వారా నరాలకు మేలు జరుగుతుంది. తరచూ చేపలు తినడం, చేప నూనె పోషకాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.