1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:06 IST)

కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే...?

పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలని చాలామంది నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. పొట్ట తగ్గడం కోసం తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. బరువు తగ్గడానికి ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ తినడాన్ని తగ్గించాలి. వీటిల్లో అధికపాళ్లలో సోడియం ఉంటుంది.
 
బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ గ్లాస్ పాలలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే నెలరోజుల్లో బరువు తగ్గుతారని వైద్యులు వెల్లడించారు. దాంతో రోజులో 10 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. 
 
కొత్తిమీరను మిక్సీలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. దానిలో నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె కూడా కలపాలి. ఈ జ్యూస్‌‌ని ఖాళీ కడుపుతో లేచిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా తగ్గిపోతుంది.
 

జంక్‌‍ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో క్యాలరీలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బరువు తగ్గించడం కోసమని నిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలుపుకొని తాగుతుంటారు. అయితే దీనికంటే.. కొత్తిమీర జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.