1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:47 IST)

రుతుక్రమ సమస్యలకు చెక్ పెట్టే బెల్లం

రుతుక్రమ సమస్యలకు ముఖ్య కారణం శరీరానికి కావలసిన మోతాదులో మినరల్స్ అందకపోవడమే. బెల్లంలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మహిళలు దీన్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. మధుమేహంతో బాధపడేవాళ్లు చక్కెర తినలేరు కాబట్టి బెల్లం తీసుకోవచ్చు.


జీర్ణక్రియకు భోజనం తర్వాత కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్‌కి శక్తినిచ్చి త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. ఇది అసెంటిక్ యాసిడ్‌లా మారి జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. 
 
హెవీ మీల్ తీసుకున్నప్పుడు బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఈజీగా జీర్ణమవుతుంది. మినరల్స్ బెల్లంలో చాలా మినరల్స్ ఉంటాయి. 
 
ఎర్రరక్త కణాలు తక్కువగా ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు బెల్లం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.