రోజుకు ఎన్ని నీళ్ళు తాగాలి... మీ బరువునుబట్టి... ఇక్కడ చూడండి....
మంచి నీరు మన శరీరానికి అమృతం లాటింది. నీళ్ళు ఒక క్రమపద్ధతిలో తాగితే చాలు... చర్మం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయ్! మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు సరిగా నీళ్ళు తాగకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుక
మంచి నీరు మన శరీరానికి అమృతం లాటింది. నీళ్ళు ఒక క్రమపద్ధతిలో తాగితే చాలు... చర్మం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయ్! మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు సరిగా నీళ్ళు తాగకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత... గోరువెచ్చని నీరు తాగి మీ దినచర్యను ప్రారంభించండి. శరీరం ఎంత తేలికగా, అరుగుదల ఎంత సాఫీ ఉంటుందో మీకే స్వానుభవం అవుతుంది. అలాగే భోజనానికి అరగంట ముందు మంచినీళ్ళు తాగండి. భోజనం మధ్యలో అవసరం అయితే గొంతు తడిచేసుకోండి తప్ప నీళ్ళు అదేపనిగా గుటగుట తాగేయద్దు. అసలు మీ బరువును బట్టీ మీరు ఎంత నీరు రోజుకు తాగాలో మీరే చూడండి...
45 కిలోలు... 1.9 లీటర్లు
50 - 2.1 లీటర్లు
55 - 2.3 లీటర్లు
60 - 2.5 లీటర్లు
65 - 2.7 లీటర్లు
70 - 2.9 లీటర్లు
75 - 3.2 లీటర్లు
80 - 3.5 లీటర్లు
85 - 3.7 లీటర్లు
90 - 3.9 లీటర్లు
95 - 4.1 లీటర్లు
100 - 4.3 లీటర్లు