మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (15:22 IST)

వారంలో బెల్లి ఫ్యాట్‌ను కరిగించడం చాలా సులువు...ఎలా..!

బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 24 గంటల్లోనే బెల్లీ ఫ్యాట్‌ను కొద్దిగా తగ్గించుకోవాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఇది సాధ్యమవుతుంది. జ్యూస్‌లు, టీలపై డైట్ ఉంటుంది. ఉదయాన్నే లేచిందే గోరువెచ్చని నీటిలో ని

బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 24 గంటల్లోనే బెల్లీ ఫ్యాట్‌ను కొద్దిగా తగ్గించుకోవాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఇది సాధ్యమవుతుంది. జ్యూస్‌లు, టీలపై డైట్ ఉంటుంది. ఉదయాన్నే లేచిందే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి నిమ్మరసాన్ని కలిపి తాగాలి. ఆ తరువాత పది గంటలకు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్‌ను లేక ఆపిల్ జ్యూస్‌ను తాగాలి. 12 గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. మధ్యాహ్నం 1 గంటకు చల్లటి ఉన్న నీరు ఒక గ్లాసు. ఆ తరువాత క్యారెట్ జ్యూస్ ఒక గ్లాస్ తాగాలి.
 
ఆ తరువాత 3 గంటలకు ఏదైనా మీకు నచ్చిన టీని ఒక కప్పు తాగాలి. 5 గంటలకు మీకు నచ్చిన జ్యూస్ ఒక గ్లాస్ తాగాలి. 7 గంటలకు మళ్ళీ ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. 9 గంటలకు ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాప్ గ్రేప్ జ్యూస్ తాగాలి. రాత్రి పది గంటలకు మళ్ళీ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని నిమ్మరసం తాగాలి. 
 
మీరు తాగే జ్యూస్‌లలో ఎక్కువగా స్వీట్‌గా ఉన్న వాటిని అస్సలు కలపకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే షుగర్ లాంటివి అస్సలు వాడకూడదు. గ్రేప్ జ్యూస్ తాగేటప్పుడు చక్కెర లేకుండా తాగాలి. ఇలా చేస్తే పొట్టలోని బెల్లీ ఫ్యాట్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా వారంరోజులు చేస్తే ఈజీగా బెల్లి ఫ్యాట్ కరుగుతుండటం మీకే తెలుస్తుంది.