గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 9 మే 2019 (21:16 IST)

తలంబ్రాలు చెట్టు ఆకులను ఆముదంలో కలిపి దంచి అక్కడ రాస్తే...

ఈ మధ్యకాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు విపరీతమైన మోకాళ్ళ నొప్పి సమస్య వస్తూ ఉంది. మన జీవనశైలి మారడం వల్ల ఆహారపు అలవాట్ల మారడం వల్ల ఈ మధ్యకాలంలో ముప్పై సంవత్సరాలు పైబడిన వారిలో కూడా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు విపరీతంగా బాధిస్తూ ఉన్నాయి. 
 
అయితే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి చాలామంది కొన్ని టాబ్లెట్లు ఇస్తారు. టాబ్లెట్లు వాడడం వల్ల కొన్ని రోజులు పనిచేసి ఆ తరువాత మళ్ళీ నొప్పులు ప్రారంభమవుతాయి. మరికొంతమంది శస్త్రచికిత్సలు కూడా చేయించుకుని ఆ ఆపరేషన్లు విఫలమై మళ్ళీ బాధపడుతూ ఉంటారు.
 
నేచురల్‍గా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకునే మార్గాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తలంబ్రాలు చెట్టు మోకాళ్ళ నొప్పులకు మంచి ఔషధమట. గ్రామాలలో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చెరువు కట్టలు, పిల్ల కాలువల పక్క గానీ ఆ కాలువలో ఇరువైపులా మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. 
 
వాటి ఆకులను తీసుకుని ఆముదం నూనెను కొంచెం బాగా దంచి లేబనంగా చేసుకొని మోకాళ్ళ నొప్పులు ఎక్కడున్నాయో అక్కడ పైపూతగా పూసి ఒక బట్టతో గట్టిగా కట్టుకట్టాలి. దీనిని సాయంత్రం పడుకునే ముందు చేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.