తీపిని తినటం నియంత్రించుకోవటం ఎలా?

sugar
Last Modified మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (14:05 IST)
మితిమీరి తీపి తింటే అనర్థాలకు దారి తీస్తుందని తెలిసినా.... మనసు అటువైపే లాగుతుంది. అలాంటప్పుడే ఎలా నియంత్రించుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం...

పంచదార వాడేవారు దానికి బదులుగా కొన్ని రోజులు బెల్లం, తేనె వంటివి ఎంచుకోవాలి. అలానే కొన్నింట్లో వినియోగాన్ని తగ్గించి, పండ్ల గుజ్జును వాడుకోవచ్చు. ఇలాంటివి చేస్తే తీపి తినాలనే కోరికను తగ్గిస్తాయి.

ఒకేసారి తీపి మానేయలేం అనుకుంటే... కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. అంటే కాఫీ, టీలలో రెండు చెంచాల చక్కెర వేసుకునే అలవాటు ఉంటే, ఒక చెంచాకు పరిమితం చేయండి. ఇలా చేస్తూనే కొంత కొంత తగ్గించుకుంటూ రావాలి.

వీలైనంత వరకూ ఐస్‌క్రీంలు, చాక్లెట్లు, కేక్‌లు లాంటివి తినటం మానేయండి. మొదట్లో ఇది కష్టంగానే అనిపించొచ్చు కానీ, క్రమంగా అలవాటైపోతుంది. కనీసం వారం, పదిరోజులు అలాంటి తీపి పదార్థాలను మానేస్తే... ఇలా చేస్తే తరహాలో కొంత వరకు ఫలితం కానవస్తుంది. కొందరికి భోజనం చేసిన వెంటనే ఏదో ఒక తీపి
తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓ పండు తీసుకోండి. క్రమంగా తీపి తినాలనే ఇష్టం కూడా తగ్గుతుంది. ఇలా మనకు మనమే నియంత్రించుకోవచ్చు. దాన్ని వలన మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు.దీనిపై మరింత చదవండి :