ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 మార్చి 2021 (23:16 IST)

కాలేయానికి అద్భుత ఔషధం గుమ్మడికాయ... ఇంకా..

గుమ్మడికాయలు దిష్టి తీయడానికి ఉపయోగిస్తుంటారు. ఐతే ఈ బూడిదగుమ్మడి రక్తపుష్టిని కలిగిస్తుంది. గర్భాశయ వ్యాధులతో బాధపడే స్త్రీలకు ఇది చలవ చేసి రక్తపుష్టిని కలిగించడానికి దోహదపడుతుంది.
 
బూడిదగుమ్మడి లివర్ వ్యాధులన్నింటిలోను అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో తీవ్రతను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో, టి.బి. వ్యాధిలోను నిస్సత్తువను పోగొడుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని యిస్తుంది. బూడిద గుమ్మడి మూత్రవ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను చీము దోషమును తగ్గిస్తుంది.
 
మొలలు వ్యాధిలో రక్తం పడుతున్న సందర్భంలో బూడిదగుమ్మడి తీసుకుంటే రక్తం పడటం ఆగుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు తమ చికిత్సలో బూడిదగుమ్మడి కూడా చేర్చితే వ్యాధి త్వరగా తగ్గుతుంది.
 
బూడిద గుమ్మడి మెదడుకు చలువ చేస్తుంది. పిల్లలకు హల్వాలా తయారుచేసి పెడితే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
 
మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడి బాధపడుతున్నవారు బూడిదగుమ్మడి కాయతో మినపప్పు బదులుగా ఉలవలుతో వడియాలు పట్టుకుని తింటే మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి.