చెరకు రసాన్ని తీసుకుంటే? ఎముకల బలానికి?
నీరసంగా ఉన్న సమయంలో గ్లాసు చెరకురసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సూక్రోజును శరీరం వెంటనే స్వీకరించడమే అందుకు కారణం. అలసట కూడా దూరంచేసెందుకు సహాయపడుతుంది. చెరకులో క్యాల్షియం ఉండటంతో అది ఎము
నీరసంగా ఉన్న సమయంలో గ్లాసు చెరకురసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సూక్రోజును శరీరం వెంటనే స్వీకరించడమే అందుకు కారణం. అలసట కూడా దూరంచేసెందుకు సహాయపడుతుంది. చెరకులో క్యాల్షియం ఉండటంతో అది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది. అంతేకాదు, వెన్నెముక బలంగా ఉండటానికి కూడా చెరకు ఉపయోగపడుతుంది.
పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు చెరకు రసంలో చాలా ఎక్కువ ఉన్నాయి. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. కాలేయాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. రోజుకు ఇలా రెండు సార్లు తీసుకుంటే కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది.
అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచడంలోనూ చెరకురసం అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం ఇందులో ఉండటంతో ఈ రసాన్ని తీసుకుంటే అజీర్తికి దూరంగా ఉండవచ్చును. రొమ్ము క్యాన్సర్ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కణాలు అడ్డుకుంటాయని పరిశోధనలో తెలియజేశారు.