బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:03 IST)

మధుమేహం వున్నవారు అంజీర పండు తింటే ఏమవుతుంది? (video)

అంజీర శరీరంలోని ఇన్సులిన్‌ను క్రమబద్దీకరిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం చక్కెర నిల్వను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. అంజీరను షుగరువ్యాధిగ్రస్తులకు చక్కటి వరం అని చెప్పవచ్చు.
 
అంజీరలో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచుతుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా అంజీరను తినడం వలన పెళుసుగా మారిన ఎముకలు పుష్టిగా తయారవుతాయి. ఇందులో ఉండే పైబర్ ప్రేగులో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 
అంజీర పండు పురుషలలో శృంగారేఛ్చను రెట్టింపు చేయడంతో పాటు సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది.
 
అంజీరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు అంజీరను డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పైబర్ తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేయడంతో పాటు మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.
 
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
 
అంజీరలో ఒమోగా3 ప్యాటీ ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇది చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌‌ను పెంచుతుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది.