శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:57 IST)

ఆఫీసుల్లో అతిగా స్నాక్స్ తింటే ఏమవుతుందో తెలుసా?

చాలామంది ఉద్యోగులు ఆఫీసుల్లో ఇష్టానుసారంగా స్నాక్స్ ఆరగిస్తుంటారు. తమ వెంట తెచ్చుకునే ఆహార పదార్థాలతో పాటు.. బయటి ఫుడ్స్‌ (స్నాక్స్)ను కూడా తింటుంటారు. ముఖ్యంగా ప్రతి గంటకో రెండు గంటలకొక సారి బిస్కట్లు, చిప్స్ వంటివి లాగించేస్తుంటారు. ఇలా ఆరగించేవారే త్వరగా ఊబకాయం బారిన పడుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఆఫీసులో స్నాక్స్‌ తీసుకునే వారి శరీరంలోకి యేడాదికి లక్ష కేలరీలు వచ్చి చేరుతాయట. ఒకటి రెండు బిస్కట్లు కన్నా ఎక్కువ తిన్నా, మిల్క్‌ కాఫీ రెండు సార్లకంటే ఎక్కువ తాగితే 80 నుంచి 100 కేలరీలు అదనంగా వచ్చి చేరతాయంటుని అంటున్నారు. అంతేకాకుండా కొందరికి కేకులు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. 
 
అలాగే, ఒక్కోకేకులో 10 నుంచి 12 గ్రాముల ఫ్యాట్‌, 300 నుంచి 400 కాలరీలు ఉంటాయి. ఇవి రోజుకు ఒకటి తిన్నా కూడా ఊబకాయం రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కూర్చుని పనిచేసే మహిళలు వీటికి ఆమడ దూరంలో ఉండాల్సిందే అని వారు చెబుతున్నారు. పనిమధ్యలో ఏదైనా తినాలని అనిపించినా, పళ్ళు, కూరగాయల ముక్కలు తినడం మేలని వారు సూచిస్తున్నారు.