శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:33 IST)

ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?

ఆఫీసుకు వెళ్తున్నారా? పోషకాహారంతో పాటు హెల్దీ స్నాక్స్ తీసుకెళ్లాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఆఫీసులో పనిలో నీటిని తాగడం మరిచిపోకూడదని.. నీరు ఎక్కువగా తాగాలని వారు చెప్తున్నారు. ఎప్పుడూ బ్యాగులో పండ్లను, కూరగాయ ముక్కల్ని వుంచాలి. సాయంత్రం పూట పండ్లతో లేదా కూరగాయలతో చేసిన సలాడ్లను తీసుకుంటే.. బరువు పెరిగే సమస్య వుండదు. 
 
ఆఫీసులకు వెళ్తున్నప్పుడు స్నాక్స్‌గా ఇంటి నుంచే తెచ్చుకోవడం మరిచిపోవద్దు. సమయానికి భోజనం చేయండి. ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒక పండును దగ్గర వుంచుకోండి. 
 
బిస్కెట్లు, వేయించిన చిప్స్‌కు బదులుగా.. పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోండి. సాల్ట్ లేని బాదం, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి. రోజుకు కేవలం రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగండని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.