మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 16 జులై 2018 (09:36 IST)

ప్రతిరోజూ శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తీసుకుంటే? ఆకలి నివారణకు?

అల్లాన్ని ఎండబెట్టి తయారుచేసే శొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులుకు శొంఠి అద్భుతమైన ఔషధం. దీనిలో అజీర్తిని పోగొట్టే

అల్లాన్ని ఎండబెట్టి తయారుచేసే శొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులుకు శొంఠి అద్భుతమైన ఔషధం. దీనిలో అజీర్తిని పోగొట్టే గుణం కూడా ఉంది.
 
ఈ కాలంలో తరచుగా వర్షంలో తడవడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే టీ లేదా కాఫీ లో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడిలో చిటికెడు బెల్లం ముక్కను కలిపి ప్రతిరోజూ తీసుకుంటే మంచిది. 
 
అలాగే చెంచా శొంఠి పొడిలో చిటికెడు లవంగాల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కప్పు నీటిలో ఆ మిశ్రమాన్ని వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించుటకు సహాయపడుతుంది. వేడి అన్నంలో శొంఠి పొడిలో కాస్త పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ పొడిని వేడి పాలలో వేసుకుని చిటికెడు చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. శొంఠి పొడిని నీళ్లల్లో కలిపి పేస్టులా చేసుకుని నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.