సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2022 (23:05 IST)

బరువు తగ్గడానికి పవర్ యోగా భంగిమలు

Yoga
బరువు తగ్గడానికి యోగా అనువైనదేనా అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తుంటారు. యోగా అదనపు కొవ్వును పోగొట్టుకోవడంలో సహాయపడుతుంది. కానీ పవర్ యోగాకి సంబంధించిన కథ వేరు. ఇది మనస్సు- శరీరాన్ని పునరుజ్జీవింపజేసే యోగా యొక్క శక్తివంతమైన రూపం. ఇది గుండెకి సంబంధించిన వ్యాయామం లాంటిది. పవర్ యోగా బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన శరీరాన్ని- ఒత్తిడి లేని జీవితాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది మానసిక దృష్టిని కూడా పెంచుతుంది.

 
పవర్ యోగా అష్టాంగ యోగాలో మూలాలను కలిగి ఉంది. ఆసనాలు అంతర్గత వేడిని పెంచుతాయి. మీ శక్తిని పెంచుతాయి, మిమ్మల్ని బలంగా, అనువైనవిగా ఒత్తిడి లేకుండా చేస్తాయి. ఇది మొత్తం శరీరానికి వ్యాయామం అందించే బలాన్ని పెంపొందించే వ్యాయామం. వాటిలో కొన్ని యోగా భంగిమలు చూడండి.

 
చతురంగదండ ఆసనం
వీరభద్రాసనం
త్రికోణాసనం
సర్వాంగాసనం
సేతుబంధ సర్వాంగాసనం
ధనురాసనం