తిరుమల కొండ కిట కిట.. లైన్ బయట భక్తులు
తిరుమలలో శనివారం భక్తులతో తిరుమల కిట కిటలాడుతోంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 53,585 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లు దాటి బయట కూడా క్యూ కట్టారు. వారికి స్వామి దర్శనానికి కనీసం 24 గంటల సమయం పడుతోంది.
ఇక నడకదారిన వచ్చే భక్తులు కంపార్టుమెంటుభక్తులు పూర్తిగా నిండిపోయారు. వారికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా ఆదివారం కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది.