బుధవారం, 28 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2015 (21:34 IST)

గణేష్ నిమజ్జనం, తిరుమల బ్రహ్మోత్సవాలు ఘనంగా పూర్తవుతాయి... గవర్నర్

హైదరాబాద్‌లో గణేష నిమజ్జనం, తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఒకే సారి జరుగుతున్నా... రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేసి, ఉత్సవాలను ఘనంగా పూర్తి చేయాలని  ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలకు వెళ్ళిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 
 
వెంకటేశ్వర స్వామి ఆశ్శీస్సులతో రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా టీ.టీ.డీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని, ఏ ఒక్క భక్తునికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేయడం సంతోషకరమన్నారు.  గవర్నర్‌తో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ నారాయణ్ కూడా ఉన్నారు.