తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయానికి శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలు, కాలినడక భక్తులకు 5గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. అదే విధంగా భక్తులకు గదుల వసతి కూడా కష్టంగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.