శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pnr
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (17:29 IST)

పవిత్ర గంగాజలం గురించి తెలియని నిజాలు ఏంటి..?

పవిత్ర గంగానది హిందువుల మతం, విశ్వాసం, స్వచ్ఛతలకు ప్రధాన సూచికగా భావిస్తారు. పురాతన కాలం నుంచి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగానది జలాలను ఉపయోగిస్తూ వస్తున్నారు.

పవిత్ర గంగానది హిందువుల మతం, విశ్వాసం, స్వచ్ఛతలకు ప్రధాన సూచికగా భావిస్తారు. పురాతన కాలం నుంచి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగానది జలాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. 
 
ముఖ్యంగా కుటుంబంలో ఎవరు జన్మించినా, ఎవరైనా మృతి చెందినా గంగాజలాన్ని వారిపై చల్లితే పవిత్రులవుతారనే ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్ళలో, దేవుని పటాల వద్ద పెట్టుకుని పవిత్రమైనదిగా భావిస్తూ పూజిస్తుంటారు. పైగా, ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవ్వదంటారు. అలాంటి పవిత్రమైన గంగాజలంపై ఉన్న నమ్మకాలను ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దా. 
 
గంగాజలాన్ని తీసుకోవడం వల్ల పాపాలు చేసిన వారికి మోక్ష ప్రధానం లభిస్తుందట. మరణించే సమయంలో గంగాజలాన్ని తీసుకోవడం వల్ల స్వర్గానికి వెళ్తారనే నమ్మకం ఉంది. పూర్వీకుల నుంచి గంగాజలాన్ని అమృతంగా భావిస్తూ సేవిస్తుంటారు. 
 
గంగానది తన సుధీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను అడవులలోని చెట్ల ద్వారా గ్రహిస్తుందంటారు. గంగానది పొడవు మొత్తం 2510 కిలోమీటర్లు. దేవుళ్లు సైతం గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని పురాణాలు చెపుతున్నాయి. 
 
గంగానదిలో స్నానమాచరించడం వల్ల చేసిన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందనే నమ్మకం. మృత్యువుకు దగ్గరపడినపుడు గంగా జలాన్ని ఒంటిపై చల్లుకోవడం ద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉంది. 
 
అలాగే, మరణానంతరం అస్తికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా. గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు పితృదేవతలు తరిస్తారట. అంతటి పవిత్రమైన జలాలు గంగానీరు. అలాంటి నది ఇపుడు కాలుష్య కోరల్లో చిక్కునివుంది.