బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (11:55 IST)

హోలీ సంబరాలు... ఒకే ఫ్రేములో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ పండుగను చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జరుపుకుంటారు. అయితే, ఈయేడాది కరోనా వైరస్ భయం కారణంగా దేశంలో హోలీ సంబరాలు పెద్దగా కనిపించలేదు. కానీ, కొన్ని చోట్ల మాత్రం ఈ వేడుక‌లు జరుగుతున్నాయి. 
 
కొంద‌రు నిన్న హోలీని జ‌రుపుకోగా, మ‌రి కొంద‌రు నేడు జ‌రుపుకుంటున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి హోలీ వేడుక జ‌రుపుకున్నాడు. భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అంద‌రికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చూసిన ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. ప్ర‌స్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో చెర్రీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో చిత్రం చేయనున్నాడు. 
 
అలాగే, తన కుమార్తె ఆరాధ్య‌తో క‌లిసి రంగుల‌కేళి హోలీని బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ సరదాగా జరుపుకుంది. క్యూట్ స్మైల్‌తో ఉన్న ఇద్ద‌రి పిక్స్‌తో పాటు హోలీ ద‌హ‌నంకి సంబంధించిన ప‌లు ఫోటోలు కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.
 
అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా తనదైనశైలిలో హోలీ సంబరాలను జరుపుకున్నారు. పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో కిరణ్‌ బేడీ పాల్గొన్నారు. రంగులకు బదులుగా పూలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్‌ కిరణ్‌ బేడీ.. రాజ్‌భవన్‌ సిబ్బందిపై పూలు చల్లుతూ హోలీ సంబురాల్లో మునిగితేలారు.