బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (17:00 IST)

హోలీ పండుగ, ఎలాంటి రంగులు వాడుతున్నారు?

హోలీ
ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటే హోలీ పండుగ. రంగురంగుల పండుగ హోలీ నాడు ఇతరులపై రంగులు చల్లడమంటే అందరికి మహా సరదాగావుంటుంది. కాని హోలీపండుగనాడు రంగులు చల్లుకున్న తర్వాత ఆ రంగులను తొలగించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో చాలామంది హోలీ పండుగనాడు రంగులు చల్లుకునేందుకు ఇష్టపడరు.

కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రంగులను తొలగించుకునేందుకు కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు మీకోసం ఇస్తున్నాం. వీటిని పాటిస్తే మీ శరీరంపైనున్న రంగులను సునాయాసంగా తొలగించుకోవచ్చు. 
 
ప్రస్తుతం లభించే రంగులు రసాయనాలతో కూడుకున్న రంగులు మార్కెట్లో లభ్యమౌతున్నాయి. వీటినే తప్పనిసరిగా వాడాల్సివస్తోంది. ఈ రంగులు వాడటంతో శరీర చర్మంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి హోలీ సంబరాలు జరుపుకున్న తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శరీరంపై పడ్డ రంగులను తొలగించుకుంటే అంతమంచిది.   
* దుస్తులు, తలపైపడ్డ రంగులను చేతులతో దులిపేయవచ్చు. రంగులను ఎంతమేరకు దులపగలుగుతారో అంతమేరకు దులిపేయండి. ఆ తర్వాత మెత్తటి పొడిబట్టతో రంగులను దులిపేందుకు ప్రయత్నించండి. 
 
* రంగులను మెలమెల్లగా తొలగించేందుకు ప్రయత్నించండి. వేగంగా తొలగించేందుకు ప్రయత్నిస్తే శరీర చర్మంపై మంట కలగవచ్చు. చర్మాన్ని ఎక్కువగా రుద్దితే చర్మం ఊడిపోయే ప్రమాదం ఉంది. 
 
* బేసన్ లేదా మైదా పిండిలో నిమ్మరసం కలుపుకుని ఆ మిశ్రమాన్ని రంగులపై పూయండి. వీలైతే కొబ్బరి నూనె లేక పెరుగుతో శరీర చర్మంపైనున్న రంగులపై పూయండి. దీంతో రంగులు తొలగించబడుతాయి.
 
* రంగులను తొలగించేందుకు కిరోసిన్, రసాయనాలతో కూడుకున్న డిటర్జెంట్ లేదా బట్టలుతికే సబ్బును వాడకండి. ఇవి చర్మానికి హాని కలుగచేస్తాయి. 
 
* వెంట్రుకలకు అంటుకున్న రంగులను తొలగించేందుకు వెంట్రుకలను బాగా దులపండి. పొడి రంగులు అంటుకుని వుంటే అవి తొలగిపోతాయి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో మీ తల వెంట్రుకలను కడిగేయండి. బేసన్ లేదా పెరుగుతో కలుపుకున్న నెల్లికాయ(ఉసిరికాయ)రసంతోను తలను కడిగేందుకు ఉపయోగించవచ్చు. ఉసిరికాయను ఒకరోజు ముందే నానబెట్టండి. ఆ తర్వాత షాంపూను తలకు దట్టించి స్నానం చేయండి. 
 
* అనుకోకుండా కళ్ళల్లో రంగులు పడిపోతే వెంటనే చల్లటి నీటితో కళ్ళను కడగండి. కళ్ళల్లో మంట తగ్గకపోతే ఓ పెద్ద గిన్నె నిండుగా నీళ్ళు తీసుకోండి. అందులో మీ కళ్ళనుంచి కనురెప్పలను తెరిచి కనుగుడ్లను అటూ-ఇటూ పదేపదే తిప్పండి. కాసేపైన తర్వాత రోజ్ వాటర్‌ కొన్ని చుక్కలు వేయండి. కాసేపటి వరకు కళ్ళను మూసి వుంచండి. వీలైతే కళ్ళపైన కింద చందనపు పేస్టును పూయండి. ఎండిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. కాసింత ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు కంటి చుక్కల (ఐ డ్రాప్స్) మందును కళ్ళలో వేయవచ్చు. 
 
* రంగులను తొలగించుకున్న తర్వాత చర్మం పొడిబారుతుంది. చర్మం అక్కడక్కడ మంటపుడుతుంటుంది. చర్మం పూర్వపు స్థితికి చేరుకోవాలంటే చర్మంపై మాయిశ్చరైజర్, చేతులు, కాళ్ళకు బాడీ లోషన్‌ను పూయండి. 
 
* వీలైతే హోలీ సంబరాలు పూర్తయిన తర్వాత మీరు ఫేషియల్, మేనీక్యూర్, పెడిక్యూర్ తదితర చికిత్సలు తీసుకోవచ్చు.