సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (15:41 IST)

లక్ష్మీస్ ఎన్టీఆర్ 'అవసరం' రిలీజ్ (Video)

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రంలోని ఒక్కో పాటను సందర్భానుసారంగా ఆయన రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇందులోభాగంగా గురువారం ఆయన మరో పాటను విడుదల చేశారు. 'అవసరం' పేరుతో విడుదలయ్యే ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. 
 
తాజాగా చిత్రం నుండి "అవ‌స‌రం" అంటూ సాగే పాట వీడియో విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ మాలిక్ సంగీతంలో రూపొందిన ఈ పాట‌కి సిరా శ్రీ లిరిక్స్ రాశారు. విల్స‌న్ హ‌రెల్డ్ ఆల‌పించారు. ఈ సింగ‌ర్ వాయిస్ కాస్త ఘంట‌సాల వాయిస్‌లా అనిపిస్తుండ‌డంతో వ‌ర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాట‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. ఈ పాట‌ని ఘంట‌సాల ఆల‌పించ‌లేదు అని ఫ‌న్నీగా కామెంట్ పెట్టారు. 
 
ఇటీవ‌ల ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో బాలకృష్ణ నిర్మించి నటించిన 'ఎన్టీఆర్ కథనాయుకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు నిరాశ కలిగించాయి. దీంతో వర్మ తీస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రంలో యజ్ఞాశెట్టి 'లక్ష్మీపార్వతి' పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు. ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.