సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By జె
Last Modified: మంగళవారం, 28 జనవరి 2020 (18:22 IST)

గ్రామీస్ 2020లో క్లీన్ క్లీవేజ్ చేసిన ప్రియాంకా చోప్రా, ట్రోల్స్ స్టార్ట్

హీరోయిన్‌ ఎవరైనా మోతాదుకి మించి అందాల ప్రదర్శన చేస్తే ఇక అభిమానులకు పండుగే. ఇది పెద్దగా చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిందే. అయితే అభిమానులను ఉర్రూతలూగించేందుకు ప్రియాంక చోప్రా డీప్‌ నెక్‌ వున్న గౌన్‌ వేసుకుంది. అది కూడా గ్రామీస్ 2020 వేడుకల్లో ప్రియాంక వేసుకున్న గౌన్‌ సర్వత్రా చర్చకు దారితీస్తోంది. 
 
విపరీతంగా క్లీవేజ్‌ రివీల్‌ అవుతోన్న ఆ డ్రస్‌లో ప్రియాంక కంఫర్టబుల్‌గానే ఉందట. ఇండియాని రిప్రజెంట్‌ చేస్తోన్న విషయాన్ని విస్మరించిన ప్రియాంకా విదేశీ తారలకి మించిన అందాల ప్రదర్శన చేయడమేంటో అక్కడి వారికే అర్థం కాలేదట. తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడయిన నిక్‌ జోనాస్‌ని పెళ్ళాడిన ప్రియాంక ఎన్నోసార్లు ఓవర్‌గా మేకప్‌ అవడం లేకుంటే అంగాంగ ప్రదర్సనలు చేసే  డ్రస్‌లు వేసుకోవడం చేస్తోంది. 
 
తన కంటే చాలా యంగ్‌గా వున్న భర్త ముందు తాను తేలిపోకూడదనే తాపత్రయమా లేక తానే సెంటర్‌స్టేజ్‌ అవ్వాలనే ప్రయత్నంలో భాగమా అనేది తెలియదు కానీ ప్రియాంక మాత్రం ట్రోల్స్‌కి హాట్‌ ఫేవరెట్‌ అయింది. ఇపుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.