జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఒక దివ్యౌషధం

hair loss
సిహెచ్| Last Modified శుక్రవారం, 8 నవంబరు 2019 (20:48 IST)
సాధారణంగా చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. తలకు షాంపూ పెట్టుకునేవారిలో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా కనబడుతుంది. అయితే అలాంటి వారికి జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఎక్కడో భూమి లోపల పెరిగే అల్లం మనిషి తలమీద వెంట్రుకలకు మేలు చేయడం ఒక చిత్రమే. అల్లం రసం షాంపూలో కలుపుకుని తలస్నానం చేస్తే సహజంగా తేమ నిలిపినప్పుడు జుట్టుకు ఉండే అందం, నిగారింపు వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అల్లం రసం వల్ల శిరోజాల మొదలు బలపడి వాటి మూలాలకు బలం వస్తుంది. జుట్టు రాలటం ఆగిపోతుంది. జుట్టును బాగా ఎదిగేలా చేయడం అల్లం చేయగలదట. తలకు రాసుకున్నప్పుడు మాడుకు రక్తసరఫరాను మెరుగుపరిచి శిరోజాలకు ఆరోగ్యం ఇస్తుందట.

అంతేకాకుండా మాడుకు పట్టిన చుండ్రును తొలిగించగలిగిన శక్తి అల్లం రసంలో ఉందట. చిట్లిపోయిన వెంట్రుకలను మరమ్మత్తు చేయగలదట. ఎండిపోయినట్లుగా ఉన్న వెంట్రుకలకు తేమ ఇవ్వగలదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.దీనిపై మరింత చదవండి :